Telegram Group

Teaching & Govt Job Telegram Group

GATE Result: గేట్‌-2024 ఫలితాల వెల్లడి తేదీని ప్రకటించిన ఐఐఎస్సీ బెంగళూరు, రిజల్ట్స్ ఎప్పుడంటే?

GATE 2024 Results: ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(GATE)-2024' ఫలితాలు మార్చి 16న విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో గేట్ పరీక్షలను ఐఐఎస్సీ బెంగళూరు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని త్వరలోనే విడుదల చేయనున్నారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. 

GATE Result: గేట్‌-2024 ఫలితాల వెల్లడి తేదీని ప్రకటించిన ఐఐఎస్సీ 

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

గేట్  ఫలితాలు 2024

 🔺

పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఫిబ్రవరి 16న, ఆన్సర్ కీని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. అనంతరం ఆన్సర్ కీపై అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్చి 16న గేట్ ఫలితాలను వెల్లడించనున్నారు. అభ్యర్థులు మార్చి 23 నుంచి గేట్ స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఐఐఎస్సీ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 3 నుంచి హాల్‌టికెట్లు అందబాటులో ఉన్నాయి. పరీక్ష రోజు వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


గేట్ 2024 ఫలితాలు : పరీక్ష విధానం..

🔺


✦ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహించారు.

✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm, 2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.

 🔺

✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు. 

గేట్ పరీక్ష : 30 సబ్జెక్టులకు పరీక్ష..

దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. 'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.

 🔺

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ స్కోరుకు మూడేళ్లపాటు విలువ ఉంటుంది.

 🔺

Direct Link:- Website Link  




Tags

Ads Right 1

Ads Right 2

в